దేవనకొండ మండలం నేలతలమర్రి గ్రామంలో కొలిచిన వారికీ వరాలు ఇచ్చే పెద్ద చందమామ, చిన్న చందమామ స్వాములకు గ్రామస్థులు గురువారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీర్ల యొక్క ముళ్లసాహెబ్ ఇంటి దగ్గరి నుండి పీర్ల చావిడి వరకు స్వాముల వారి జెండాను భక్తి శ్రద్దలతో తీసుకొని వచ్చి పూజలు నిర్వహించారు. ఆ తరువాత గ్రామం చుట్టూ స్వాములు కొబ్బరికాయలు పూడ్చారు. ఇలా చేయడం ద్వారా ఆ గ్రామాములోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారు అని అలాగే పంటలు బాగా పండుతాయి అని గ్రామ ప్రజల నమ్మకం. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పక్క గ్రామాల వారు పాల్గొన్నారు.