పంట కాలువలో ఇరుక్కుపోయిన సిమెంట్ లారీ

76చూసినవారు
అవుకు మండల పరిధిలోని ఎన్. హెచ్-544డి రహదారిలో శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. బనగానపల్లె నుంచి సిమెంట్ లోడ్ తో తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో ఇరుక్కుపోయింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. లారీని బయటకి లాగడానికి మూడు పొక్లెయిన్లు కష్టపడ్డాయి. దీంతో రహదారిలో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్