శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

50చూసినవారు
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు చేపడతామని సీఐ గోపినాథ్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. మండలంలోని బెలుం శింగవరం, బెలుం, కొలిమిగుండ్ల, కనకాద్రిపల్లె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. చిన్నపాటి కారణాలతో గొడవలకు పాల్పడితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు.