
బేతంచెర్ల: ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను రద్దు చేయాలి
ప్రభుత్వం పొదుపు సంఘాల విఏవోల కిచ్చిన సర్ క్యులర్ ను రద్దుచేయాలని, ప్రభుత్వం బాకీ పడిన 6 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలని వివోఏల సమస్యలపై 27, 28, 29 తేదీలలో కలెక్టర్ కార్యాలయాల దగ్గర దీక్షలు జరుగునని, ఈ దీక్షాకు బుక్ కీపర్లు ఆందరూ పాల్గొని విజయవంతం చేయాలని బేతంచెర్ల మండల వివోఏల సంఘం నాయకులు ఎన్. వెంకటరమణ, మధులు సోమవారం తెలిపారు. బేతంచెర్ల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏపిఎం మధుకు, వినతిపత్రం అందజేశారు.