
సంజామల: ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు
సంజామల మండలం సంజామల ఎంపీడీవో కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో సాల్మన్, ఎంపీపీ పోచా వెంకట రమాదేవిలు న్యూ ఇయర్ కేక్ ను కట్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈవోపీఆర్డీ రాధిక రెడ్డి, ఏఓ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా నూతన సంవత్సర సందడి నెలకొంది.