మండల కేంద్రమైన అవుకు నుంచి మెట్టుపల్లికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలతో ఈ రహదారి మరింత దారుణంగా మారింది. కాగా ఇదే రహదారి మీదుగా కస్తుర్భాగాంధీ, మోడల్ స్కూల్ కు విద్యార్థులు వెళ్లాల్సి ఉండటంతో వారు సైతం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.