ఆత్మకూరు: బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు

67చూసినవారు
ఆత్మకూరు మండలం ముష్టపల్లి గ్రామానికి చెందిన ఖాదరమ్మ అనే వృద్ధురాలు సోమవారం బహిర్ భూమికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోయింది. ఆమె కేకలు వేయగా, అటుగా వెళుతున్న కానిస్టేబుల్ మౌలాలి, హోంగార్డు చక్రపాణి గమనించి ఆమెను కష్టం మీద కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్