
కోవెలకుంట్లలో ఉచిత పెన్షన్ పంపిణీ కార్యక్రమం
రిటైర్డ్ గ్రంథాలయ అధికారి సామాజిక సేవకుడు పల్లె నర్సింహారెడ్డి కోవెలకుంట్ల నివాసంలో ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో ప్రతినెల వృద్ధులు వికలాంగులు అనాథలకు ఇచ్చే పెన్షన్లను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దస్తగిరి అనే వ్యక్తి సామాజిక సేవలో తన వంతు సహాయం చేయడానికి ముందుకు రావడం పట్ల బుధవారం అభినందించారు. ప్రతి మనిషి తనకు ఉన్నదాంట్లో ఇతరులకు సహాయం చేయాలన్నారు. నారాయణస్వామి, శ్రీనివాసరెడ్డి రాములమ్మ పాల్గొన్నారు.