బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తి గ్రామ శివారులోని కుందూనది, సంజామల మండల కేంద్రంలోని పాలేరు వాగుకు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తింది. సోమవారం ఆ వాగులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. అటు ప్రధాన కాలువలు, వంకలు, వాగులకు కూడా వరద నీరు భారీగా చేరింది. దీంతో జలకళ సంతరించుకున్నాయి. కాగా పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి.