నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, మీ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనిపోతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు కోరగా మంగళవారం దీక్షలు విరమించారు. 10 రోజులుగా బేతంచెర్ల మైనింగ్ కార్యాలయం ముందు చేస్తున్న దీక్షలు యాజమాన్యంఎంపీ శబరి నిమ్మరసం అందించి దీక్షలు విరమింపజేశారు.