కోడుమూరు మండలంలో బుధవారం అర్ధరాత్రి గురువారం వరకు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వర్షంరాకతో ఉల్లి, పత్తి, కంది వంటి పంటలకు ఎరువులు వేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. వర్షపునీటితో చెక్ డ్యాంలు నిండి కళకళ లాడుతున్నాయి. మండలంలో 46. 8 మి. మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.