ఉద్యోగులు పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు

78చూసినవారు
ఉద్యోగులు పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, మెరుగైన సేవలు అందించాలని కోడుమూరు ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం కల్లపరి, పులకుర్తి సచివాలయాలను ఈఓఆర్డీ మంజులతో కలిసి తనిఖీ చేశారు. సమయపాలన పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని, పద్ధతులు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రతిఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేయాలని, మూమెంట్ రిజిష్టర్ లో పొందుపర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్