సి. బెళగల్ మండలంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి ఆదివారం ప్రకటనలో సూచించారు. జడివాన మూలంగా పాతమిద్దెలు కుంగే ప్రమాదం ఉందని, సురక్షిత ప్రాంతాలలో ఉండాలన్నారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ స్తంభాలు, చెట్ల దగ్గర వెళ్లొద్దన్నారు. ఎవరైనా ఇల్లు కూలిపోయే ప్రమాదంలో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో నివాసం ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు.