చనుగొండ్లలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

63చూసినవారు
గూడూరు మండలంలోని చనుగొండ్ల గ్రామంలో శుక్రవారం ఏరువాక పౌర్ణమి వేడుకలను రైతులు ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కాడెద్దులను ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. ఊరేగింపులో రైతులు కాడెద్దులతో ఆనందోత్సహాల నడుమ పండుగను చేసుకున్నారు. గ్రామదేవతలకు, పశువుల ఘాటికి నైవేద్యాలతో పూజలు నిర్వహించారు వర్షాలు విస్తారంగా కురిసి పంటలు బాగా పండి, అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్