పోలీసు అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై అవగాహన పెంచుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కర్నూలు మండలం దిన్నెదేవరపాడులోని జగన్నాథగట్టు ఫైరింగ్ రేంజ్లో పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీసు నిర్వహించారు. ఏకే-47, ఎస్ఎల్ఆర్, పిస్టల్ వినియోగంలో సాధన చేశారు. ఎస్పీ ఫైరింగ్ గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.