తెలుగు తల్లికి జలహారతి పేరుతో చేపట్టిన కార్యక్రమం విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు మాజీ ఇన్చార్జి ఆకెపోగు ప్రభాకర్ అన్నారు. మంగళవారం కర్నూలులో వారు మాట్లాడారు. రాయలసీమలో వర్షాలు రాక ఆత్మహత్యలకు పాల్పడేవారని, ఇక ఈ స్థితి నుండి విముక్తి కలగనుందని, గోదావరి నుండి బనకచర్లకు నీటిని తెచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని తెలిపారు.