కోడుమూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరు మృతి

68చూసినవారు
కోడుమూరు మండలం ప్యాలకుర్తి సమీపంలో కారును ఢీకొన్న ఐచర్ వాహనం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కోడుమూరుకు చెందిన 18వ వార్డు టీడీపీ వార్డు మెంబర్ సోమశేఖర్, రాజోలి శ్రీనివాసులు కూడా చికిత్సలో కోలుకోలేక మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. కర్నూలు నుంచి కోడుమూరు వైపు వస్తున్న కారును ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్