కోడుమూరు పట్టణంలోని కొండపై వెలసిన కొండలరాయుడి ఆలయంలో సోమవారం తేళ్ల పండుగ ఉత్సవం నిర్వహించారు. కొండను కొండ్రాయుడికొండగా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిమగా భక్తులు కొలుస్తారు. కొండపై ఏ రాయి కదిపినా తేలు ప్రత్యక్షమవుతుంది. కొండపై చేరుకున్న భక్తులు మొదట వృశ్చికాల వేట కొనసాగిస్తారు. తేలు దొరికితే చాలు అదృష్టంగా భావిస్తారు. దానికి దారం కట్టి స్వామికి నైవేద్యంగా సమర్పించి పూజిస్తారు.