అక్రమ మద్యంపై దాడులు

52చూసినవారు
అక్రమ మద్యంపై దాడులు
కర్నూలు జిల్లాలో సెబ్ అధికారులు ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అక్రమ మద్యం పట్టుకున్నారు. 10 మందిని అరెస్టు చేసి 1, 277 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 8 కేసులు నమోదు చేశారు. ఏపీ మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి 45 ఏపీ మద్యం సీసాలను పట్టుకున్నారు. నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి బెల్లం ఊటను, 40 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.

సంబంధిత పోస్ట్