నిరాశ్రయులకు సహృదయ సేవ సంస్థ చేయూత

156చూసినవారు
నిరాశ్రయులకు సహృదయ సేవ సంస్థ చేయూత
కరోనా వైరస్ ను తరిమ కొట్టేందుకు కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ వల్ల మండల కేంద్రంమైన మంత్రాలయంలోని తినడానికి తిండిలేక ఇబ్బంది పడుతున్న యాచకులకు, నిరాశ్రయులకు సోమవారం స్థానిక సహృదయ సేవ సంస్థ చేయూత అందించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన నదీతీరంలో ఉన్న దుకాణాల నిర్వాహకులు  స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయంటిఫిన్‌ను అందిస్తున్నారని, ఈ ఉచిత ఫలహారా పంపిణీ కార్యక్రమాన్ని లాక్‌డౌన్‌ సడలించే వరకు కొనసాగించడానికి సహృదయ సంస్థ సభ్యుల సహకారంతో సంస్థ తరఫున రూ.7660, 100 కేజీల బియ్యం, 25 కేజీల కూరగాయలను ఎస్ఐ వేణుగోపాల్ రాజు చేతుల మీదుగా నదీతీర ప్రాంత దుకాణాల నిర్వాహకులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్