పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన దళిత గోవిందమ్మపై దాడి చేసిన నిందితులందరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిందితులు చాకలి నాగరాజు, హుస్సేని, రాముడు, భీమరాజు భూలక్ష్మి, నరసమ్మ, లక్ష్మి, పెద్ద రంగమ్మ, గుండమ్మలను అరెస్టు చేశామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు.