చంద్రబాబు హామీలన్నీ అబద్ధాలే: ఎమ్మెల్యే

1551చూసినవారు
టీడీపీ నేతల మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం కోసిగి మండలంలోని వందగల్లు, నేల కోసిగి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు హామీలన్నీ అబద్ధాలేనని, ఏనాడూ బాబు మాట మీద నిలబడి వ్యక్తి కాదని, 2014 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలను గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీకి రెండు ఓట్లు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్