ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వరరెడ్డి గురువారం దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి స్మారకార్థం రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తన తండ్రి మోహన్ రెడ్డి 30 ఏళ్ల నుంచి ఎమ్మిగనూరు జాతర సందర్భంగా అనేక క్రీడా పోటీలు నిర్వహించి, వారి ప్రతిభను వెతికి తీసేవారని అన్నారు. తండ్రి ఆశయాలు కొనసాగిస్తున్నానన్నారు.