మంత్రాలయం మండల కేంద్రానికి చెందిన రామకృష్ణ అనే వైస్సార్సీపీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. స్పందించిన పెద్దాయన టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి రామకృష్ణకు ఆర్థిక సహాయం కింద రూ. 25 వేల నగదును రామకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేసి ధైర్యంగా ఉండాలని మేము ఉన్నామని భరోసా ఇచ్చారు.