పెద్దకడబూరులో వానోస్తే బురదమయం

68చూసినవారు
పెద్దకడబూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సబ్ స్టేషన్ సమీపంలోని రహదారి బురదమయంగా మారడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డు లేక చినుకు పడితే రోడ్లు చిత్తడిగా మారి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. డ్రైనేజీల నిర్మాణం కూడా లేక మురుగునీరు రహదారులపై ప్రవహించి, దోమలకు ఆవాసంగా మారుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించి రహదారి, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్