మంత్రాలయం: 650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
By NIKHIL 54చూసినవారుపెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలోని క్వారీ కొండలో ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి, ఎస్సై కార్తీక్ సాగర్ ఆధ్వర్యంలో 650 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గురువారం ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి మాట్లాడారు. పెద్దకడుబూరు మండలాల్లో అక్రమ కర్ణాటక మద్యం, నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్స్ భరత్, మునిరంగడు ఉన్నారు.