ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమల మంత్రి టిజి భరత్ ఉరుకుందాలో వెలసిన శ్రీ నరసింహ స్వామి దర్శనం నిమిత్తం ఉరుకుందుకు వచ్చారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎన్. రామకృష్ణ రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయంలో ఈవో మరియు ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు.