మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ప్రహ్లాదరాయల పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీమఠంలో త్రయోదశి శుభదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రహ్లాదరాయలకు పాదపూజ చేసి పల్లకిలో ఉంచి ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, స్వామిని విశేషపూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.