భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ సోమవారం మంత్రాలయం మండలం సూగురు గ్రామ రైతులు శేఖర్, తరసాలప్ప, భీమన్న, హనుమంతులు కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను కలిసి వారి సమస్యలను విన్నవించారు. కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాను కలిసి మాట్లాడారు. వర్షాలకు మిరప, పత్తి, పంటలు నష్టపోయామని, రైతులను ఆదుకోవాలని వినతిపత్రం ద్వారా కోరారు.