కౌతాళం తహశీల్దార్ సస్పెన్షన్

55చూసినవారు
కౌతాళం తహశీల్దార్ సస్పెన్షన్
కర్నూలు జిల్లాలోని కౌతాళం తహశీల్దార్ మల్లికార్జునస్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ పి. రంజిత్ బాషా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హాలహర్వి మండలం తహశీల్దార్ గా పనిచేసిన సమయంలో నిట్రవర్తి అనే గ్రామంలో ఒక వివాదాస్పద భూమిని నిబంధనలకు విరుద్ధంగా బాధితులకు కట్టబెట్టాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ తో కలెక్టర్ విచారణ చేయించారు. రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు.

సంబంధిత పోస్ట్