కాలుజారి యువకుడు మృతి చెందిన ఘటన కొత్తపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటు చేసుకున్నట్లు ఎస్సై కేశవ తెలిపారు. కొత్తపల్లి ఎస్సీ కాలానికి చెందిన గూడెం రాజు, ప్రమీలమ్మ దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు. అధిక వర్షాలు పడడంతో కాలనీలో బురద ఉండడంతో గూడెం స్వాములు ప్రమాదవశాత్తు ఇంటి ముందు కాలుజారి క్రింద పడి తలకు బలమైన గాయం తగలగా కుటుంబ సభ్యులు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మృతిచెందినట్లు చెప్పారు.