చుక్కల భూముల పట్టాలపై ఆరా

54చూసినవారు
చుక్కల భూముల పట్టాలపై ఆరా
కొత్తపల్లి స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో నంద్యాల బీజీ రైల్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నందికొట్కూర్ నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె. సుధారాణి గురువారం రెవెన్యూ రికార్డులను తనిఖీ చేశారు. ముందుగా మండలంలోని చుక్కల భూములకు చెందిన పట్టాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 20 ఏళ్ల కిందట గ్రామాలలో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన చుక్కల భూముల పట్టాల వివరాలు పరిశీలించామన్నారు.

సంబంధిత పోస్ట్