కర్నూలు జిల్లాల్లో కరోనా రక్కసి జడలు విప్పుకుంటోంది. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా జిల్లా నలుమూలలకు కరోనా శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని, కొత్తపల్లి మండలం నందికుంట గ్రామంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
గ్రామంలో ఎస్సి కాలానికి చెందిన ఓ 28 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కాగా అతడిలో వైరస్ లక్షణాలు కనిపించటంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్‌లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం నంది కుంట గ్రామంలో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలను కూడా అలెర్ట్ చేశారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.