ఏరువాక పున్నమి కార్యక్రమంలో నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ పాల్గొన్నార ఏరువాక పౌర్ణమి సందర్భంగా నందికొట్కూరులో ఏరువాక కార్యక్రమంలో రైతులతో కలిసి పనిముట్లకు ఎద్దులకు భూమికి పసుపు-కుంకుమ అద్ది పూజ చేసి దుక్కి దున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండగలాగా జరుపుకుంటారని అన్నారు. రైతులకు అండగా ఉన్న కుటుంబం వై.ఎస్ కుటుంబమని వై.ఎస్ కుటుంబం రైతుల పక్షపాతి కుటుంబమని అన్నారు రైతులకు రైతు భరోసా కల్పిస్తూ అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని గత ప్రభుత్వంలో ఎరువులు విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాసే వారని గతంలో వర్షాలు సరిగ్గా పడక వేసిన పంటలు చేతికి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని 2014 సం లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు 5లక్షలు ఇస్తాను అని చెప్పి రైతు కుటుంబాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని జగన్ అధికారంలోకి వచ్చాక 2014 సం లో చనిపోయిన రైతు కుటుంబాలకు 5లక్షలు ఇచ్చారని అదే విధంగా 2019 సం లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను 7లక్షలు ఇచ్చి రైతులను ఆదుకున్న ఘనత సీఎం జగన్ దని అన్నారు.