ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. పాములపాడు మండలంలోని వాడాల గ్రామంలో టిడిపి నాయకులు జనార్దన్ రెడ్డి, రామస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయటానికి ఏర్పడిన కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, రమణారెడ్డి, 197 టిడిపి బూత్ ఇన్చార్జి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.