పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి

1355చూసినవారు
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలి
ఏ.పీలోకరోనా వైరస్ నియంత్రణ, లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఇంటర్నల్ అసెట్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చి విద్యార్థులను పాస్ చేయాలని ఆయన కోరారు.

ఆన్ లైన్ తరగతుల వల్ల గ్రామీణ, పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగంలేదని, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, ఇంటర్ నెట్ సరిగా లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఆన్ లైన్ తరగతులు విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో రవి, నాగరాజు, లింగస్వామి, ఇస్మాయిల్, వెంకటేశ్వర్లు, రామకృష్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్