బైకును ఢీ కొన్న ట్రాక్టర్...యువకుడు మృతి

2807చూసినవారు
బైకును ఢీ కొన్న ట్రాక్టర్...యువకుడు మృతి
ఆత్మకూరు శివారులోని శ్రీశైలం పోయే రోడ్డులో డంప్ యార్డ్ దగ్గర సోమవారం సాయంకాలం బైకును ఢీ కొన్న ట్రాక్టర్. ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన విశ్వనాథ్ (28) అనే యువకుడు ఈ ఘటనలో మృతి చెందాడు మృతుడికి బార్య ఇద్దరు ఆడపిల్లలు సంతానం. వివరాల్లోకి వెళితే ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన విశ్వనాథ్ బైక్ పై ఆత్మకూరు కు వెలుతుండగా అదే రూట్లో శ్రీపతిరుపతిరావు పేటకు చెందిన ట్రాక్టర్ పొలంలో సేద్యం చేసి తిరిగి వస్తుండగా ఆత్మకూరు శివారు లోని డంపింగ్ యార్డ్ దగ్గర ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన విశ్వనాథ్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుక వెలుతుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్