కర్నూలు జిల్లా ఆత్మకూరులో పేదలకిచ్చిన ఇంటి స్థలం పట్టాలపై న్యాయస్థానంను ఆశ్రయిస్తామని సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శులు శ్రీనివాసులు బుధవారం పేర్కొన్నారు. ప్రభుత్వాలు పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఇంటి స్థలం పట్టాలు పొందిన వారి పక్షాన నిలబడి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శులు శ్రీనివాసులు, ప్రతాప్ లు తెలిపారు. బుధవారం ఐక్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,,, 2000 నుండి 2003 మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఇద్దరు పిల్లలు ఉన్న వారిని గుర్తించి ప్రలోభ పెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయించారు అని తెలిపారు. అందుకుగాను ఆపరేషన్ చేయించుకొన్న ప్రతి ఒక్కరికీ ఆత్మకూరు పట్టణంలో ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేశారు. పట్టాలు మంజూరు చేశారే కానీ నేటి వరకూ స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించలేదు.
పట్టణానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో స్థలాలు వుండడం వల్ల కనీస సౌకర్యాలు లేనందువల్ల బాధితులు పట్టణంలో నే ఇంటి బాడుగలు చెల్లిస్తూ ఉన్నారని అన్నారు. ఇంటి స్థలం పట్టాల కోసం ఆశ పడి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని ఇంటి స్థలం పట్టాలు పొందితే జగన్ ప్రభుత్వంలో నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయ్యి పేదలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు.
తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు నిరసనలు, ఉద్యమాలుచేసి అధికారులకు తెలియజేసిన పట్టించుకున్న పాపాన పోలేదు అని అన్నారు. గతంలో అక్రమంగా బినామీ పేర్లతో ఇంటి పట్టాలను వెలికి తీయకుండా నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కు అయి పేదలకు కడుపు కోత మిగిల్చినారని వారు వాపోయారు. అక్రమార్కులకు అండ దండలు అందిస్తూ పేదల బతుకులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సెంటు స్థలం కొనకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన పేదల ఇంటి స్థలం పట్టాలు రద్దు చేసి వాటి స్థానంలో మరొకరికి పంచిపెట్టడం బాధకర విషయం అని అన్నారు.