కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులను తప్పనిసరిగా విధులకు హాజరు అవ్వమని చెప్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఫ్యాప్టో నాయకులు జవహర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సాయంత్రం ఆత్మకూరు పట్టణంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా విధులకు హాజరు అవ్వమని ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని,ఇదివరకు పాఠశాలలను ఆగస్టు 3వ తేదీ నుండి పునఃప్రారంభం అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి ఉన్నారు.
కానీ ఈరోజు ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు నుండే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలకు హాజరు అవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని అన్నారు.విద్యార్థులు లేకుండా ఈ కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఉపాధ్యాయులు పాఠశాలలకు పోవడం అవసరం లేదని,అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బయోమెట్రిక్ హాజరు నిలుపుదల చేసి ఈరోజు ఉపాధ్యాయులను తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. నిర్దిష్టం గా 2020-21 అకడమిక్ క్యాలండర్ ను విడుదల చేయాలని కోరారు. ఈ ఉత్తర్వులపై విద్యాశాఖ కమిషనర్ గారు పునఃపరిశీలించి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణ,నాగరాజు, పుల్లన్న, రవి,విజయకుమార్, ఇస్మాయిల్ పాల్గొన్నారు.