నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట వీధిలో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి అనే మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చైన్ ను అపహరించుకొని బుధవారం పరారయ్యారు. డోన్ కు చెందిన ఆదిలక్ష్మి నంద్యాల జగజ్జనని దేవి ఆలయాన్ని సందర్శించుకుని తమ బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో వెనుకవైపు నుంచి బైకుపై వచ్చిన ఇద్దరు అగాంతకులు మహిళ మెడలోని ఐదు తులాల గొలుసులు లాక్కొని పరారయ్యారు.