నంద్యాల నందమూరి నగర్‌లో నేడు న్యాయశాఖ మంత్రి మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం జరుగుతోంది. టీడీపీ నాయకులు శివనాగిరెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చించి వేయడంతో వైయస్ నగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన కొందరు వ్యక్తులు మా ఎదుగుదలను ఓర్వలేక ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని అన్నారు.