రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను గురువారం విజయవాడలోని ఆయన నివాసం నందు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నంద్యాల జిల్లా రాజకీయాల గురించి కాసేపు ముచ్చటించారు. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవుల కేటాయింపులో తనకు అవకాశం కల్పించాలని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మంత్రి నారా లోకేష్ ను కోరినట్లు తెలుస్తోంది.