రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోషల్మీడియాప్రతినిధులపైన పోలీసులు చేపడుతున్న అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కలిసి జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ యుగందరా బాబుకు అందజేసారు.