కొత్తపల్లి: అడవుల సంరక్షణ అందరి బాధ్యత

55చూసినవారు
అడవుల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని అటవీ రేంజ్ అధికారి రామకోటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన కొత్తపల్లిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అడవుల ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్