నంద్యాల: అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు

73చూసినవారు
గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం సంభవించిన అకాల వర్షంతో సాగులో ఉన్న పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి మండలంలోని శ్రీనివాసపురం, గోస్పాడు, యాల్లూరు, ఒంటెలగల తదితర గ్రామాల్లో సాగుచేసిన మిరప వరి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పంట పొలాలకు వెళ్లి చూడగా వరి పైరంతా నేల వాలిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్