రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నంద్యాల జిల్లాను స్వచ్ఛత జిల్లాగా రూపొందించేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం ఉదయం మహానంది మండలం గాజులపల్లి, అయ్యలూరు గ్రామాలలో, మధ్యాహ్నం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొన్నారు.