ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అని, మరో వందేళ్ల పాటు ఇది కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. విజయవాడలో నిర్వహించిన ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమానికి సంగీతం అందిస్తున్న తమన్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టికెట్ కొనకుండా ఈవెంట్‌కి రావడం గిల్టీగా ఉందని, అందుకు తన వంతుగా తలసేమియా బాధితుల చికిత్స కోసం త్వరలోనే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ.50లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించారు.