కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల జిల్లాలోని రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నంద్యాల రైల్వే స్టేషన్ రాయలసీమలోని ఒక ముఖ్య ప్రాంతమని, నంద్యాల రైల్వే స్టేషన్ గుంతకల్లు డివిజన్ లో కలపాలన్నారు.