నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానం ఉదయం 4 నుండి 7 గంటల వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.