చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించి చేనేత కార్మికులకు చేయూతను అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బనగానపల్లె మండలం, నందివర్గ గ్రామ చేనేత స్టాల్ ను ప్రారంభించి అధికారులందరిచే చేనేత వస్త్రాలను కొనుగోలు చేయించారు. చేనేత వస్త్రాలను ప్రతివారం ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు.